Kadiyam Case Hearing : అసెంబ్లీలో నేడు కడియం కేసు విచారణ

TRINETHRAM NEWS

Trinethram News : Feb 04, 2026, తెలంగాణ : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ విచారణకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కడియం అనర్హతపై బీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిటిషన్ పై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారణ చేపట్టనున్నారు.

శాసనసభలోని స్పీకర్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానందకు, ఎమ్మెల్యే కడియం శ్రీ హరికి మంగళవారం స్పీకర్‌ నోటీసులు పంపించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kadiyam case hearing in Assembly today

You cannot copy content of this page

Scroll to Top