త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమైనవని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులుఈ కళాశాల నందు చేరవలసిందిగా కోరుచున్నారు. అలాగే కళాశాలలో ఎంపీసీ సిఇసి బైపిసి హెచ్ఇసి కోర్సులతోపాటు ఈ సంవత్సరం ఎం బైపీసీ కోర్సును కూడా ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా బోధించుతామని తెలిపారు. అలాగే కళాశాలలో చేరిన విద్యార్థులకు టెస్ట్ బుక్కులు నోట్బుక్కులు మధ్యాహ్న oభోజన పథకము మరియు తల్లికి వందనం పథకాలు కూడా వర్తిస్తాయని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


