Narayana Graduation Celebrations : నారాయణ గ్రాడ్యుయేషన్ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి : విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు నారాయణ స్కూల్ నందు ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముఖ్య అతిధిగా ఏ జి ఏం షేక్ అలీషా, హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రుల హాజరై తమ పిల్లలు మెమేంటోస్, సర్టిఫికెట్స్ తీసుకోవడం చూసి ఎంతో మురిసిపోయారు.

ఏ జి ఏం షేక్ అలీషాగారు పిల్లలు చదువుల్లో రాణించడానికి అవసరమైన అనేక విషయాలు తెలియజేయగా, ప్రిన్సిపాల్ నందకుమార్, విద్యార్థుల అభివృద్ధి కొరకు నారాయణ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుందని తెలియజేసారు. తదనంతరం పిల్లల డాన్సలతో ఆవరణం దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి జోనల్ కో ఆర్డినేటర్ గోపి నాయుడు, సుశీల, హరిత, ఏవో ఆనంద్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, దివ్యశ్రీ, ఏడి చక్రవర్తి, ఉపాధ్యాయ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Narayana Graduation Celebrations

You cannot copy content of this page

Scroll to Top