అల్లూరి జిల్లా అరకులోయ ఫిబ్రవరి 13, (త్రినేత్రం న్యూస్) : కేంద్రంలోని బిజెపి సర్కారు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు అరకులోయ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీ యూడబ్ల్యూజె) అరకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, మరియు గోవర్ధన్ అధ్యక్షతన సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ మేరకు (ఏపీ యూడబ్ల్యూజె) సంఘం అరకు వ్యాలీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలను ఈ బిజెపి ప్రభుత్వం, అనుసరించడాన్ని దుయ్యబట్టారు. మోడీ సర్కారు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని వీరు డిమాండ్ చేశారు రద్దయిన 29 చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయని గుర్తు చేసినారు జర్నలిస్టుల కనీస వేతనాలకు సంబంధించి “గురు బుక్స్ మతిజియా వేజ్ బోర్డు” సిఫార్సులను అమలు చేయకపోగా ఉన్న చట్టాన్ని, కూల్ గా మార్చి పాత్రికేయ రంగాన్ని ,నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
జాతీయ కార్మిక సంఘాల చేపట్టిన సార్వత్రిక సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు పాల్గొనీ మిగత కార్మిక సంఘాలు ఉత్సాహన్నిచారు.మరియు కార్మికుల కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ తేదీన అరకు వేలి మూడు రోడ్ల కూడలి వద్ద జరిగిన సమ్మె సమయంలో విరివిగా అందరూ పాల్గొన్నారు.
బ్రిటిష్ కాలం నుంచి కార్మికుల రక్త తర్పణంతో పోరాడి సాధించుకున్న చట్టాలన్నిటిని రద్దుచేసి లేబర్ (బానిస) కోడ్స్ తెచ్చిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది, ఆని అరకు లోయ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మండిపడ్డారు.తరువత మహిళ కార్మికులను ఉద్దేశించి అరుకులోయ పాత్రికేయలు గోవర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ కోడ్ ను మహిళలను రాత్రిపూట, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయించేందుకు అనుమతిస్తున్నాయి.
సరైన భద్రత లేకుండా, రక్షణ లేకుండా మహిళలను పనిలోకి నెట్టడం అంటే వారిని హింసకు, వేధింపులకు గురిచేయడమే. ఇది మహిళల గౌరవానికి, భద్రతకు, సాధికారతకు పెను ప్రమాదం. ఇది మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, అంతే కాకుండా వారికి భద్రత కూడా ఉండదు. ఈ చట్టాలు మన దేశ కార్మిక వర్గ ప్రయోజనాలను పణంగా పెట్టి భారతీయ బూర్జువాల, బహుళజాతి సంస్థల( ఎం ఎన్ సి ) ప్రయోజనాలకు మాత్రమే మేలు చేస్తాయి.
“ఒకే పనికి ఒకే వేతనం” అనే సూత్రాన్ని ఈ చట్టాలు కాలరాస్తున్నాయి. ఫలితంగా మహిళా కార్మికులకు తక్కువ వేతనం, తక్కువ సౌకర్యాలు, తక్కువ అవకాశాలు మాత్రమే మిగులుతున్నాయి. చట్టాలను అమలుచేయాల్సిన ప్రభుత్వాలే సమాన వేతన హక్కును హరించి వేసి, లింగ వివక్షను మరింత బలపరుస్తున్నాయి,
ట్రేడ్ యూనియన్‌లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును పరిమితం చేయడం ద్వారా మహిళా కార్మికుల స్వరం నొక్కి వేస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకునే వేదికలను ప్రభుత్వం మూసేస్తోంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను బలహీనపరచడం వల్ల గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. దాంతో వలసలు పెరుగుతున్నాయి, మహిళలు మరింత అసంఘటిత రంగంవైపు, అబద్రతతో కూడిన పరిస్థితుల్లోకి నెట్టివేయ బడుతున్నారు.
బీమా, విద్యుత్, పారిశ్రామిక రంగాలలో విదేశీ మూలధనాన్ని ప్రోత్సహించడం వల్ల పబ్లిక్ రంగం విధ్వంసమవుతోంది. దీని ప్రభావం ముందుగా పడేది మహిళలపైనే. కుటుంబ భద్రత, పిల్లల భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడుతున్నాయి.
ఈ విధానాలన్నీ మహిళలను చౌకగా శ్రమచేసే కూలీలుగా, మౌనంగా పనిచేసే శ్రమశక్తిగా మార్చే కుట్రలో భాగమే. ఇది ఎంత మాత్రమూ మహిళలు అంగీకరించ కూడదు. మహిళల శ్రమను దోచుకునే విధానాలకు వ్యతిరేకంగా, గౌరవం, భద్రత, ఉపాధి హక్కుల కోసం,, కుటుంబం భవిష్యత్తు కోసం, ఆత్మ గౌరవం కోసం… దేశవ్యాప్తంగా
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళా కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు, గృహ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా పోరడే సమయం ఆసన్నమైంది.. అని అరకువ్యాలీ (ఏపీ యూడబ్ల్యూజె) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మరియు గోవర్ధన్ అన్నారు జర్నలిస్టులు సోమేశ్ కుమార్, హరిబాబు,అప్పారావు,లక్ష్మణ్, ఈశ్వరరావు,లెనిన్ రాజు, రాజు, బాబి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


