Journalist Premier League : విశాఖలో అట్టహాసంగా జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్. యూజేఎఫ్ అధ్యక్షులు డా.ఎం.ఆర్.ఎం వర్మ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్(విశాఖపట్నం) జూన్ 11 : పోర్ట్ స్టేడియంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఫ్లడ్డ్ లైట్ మ్యాచ్ క్రికెట్ ను ప్రోత్సహించిన ఘనత ఉత్తరాంధ్రకు ఉంది: యూజేఎఫ్ అధ్యక్షులు: డా. ఎం. ఆర్. ఎన్. వర్మ క్రికెట్ క్రీడను ప్రోత్సహించిన ఘనత ఉత్తరాంధ్రకు ఉందని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్ వర్మ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయులైన సర్ విజ్జు భారతదేశంలో మొట్టమొదట భారత్ క్రికెట్ జట్టు ఏర్పాటు, తగిన తర్ఫీది ఇవ్వడం, తమ సొంత నిధులతో లండన్ తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. వృత్తి రీత్యా నిరంతరం శ్రమించే జర్నలిస్టుల కోసం ఫ్లడ్ లైట్ లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ను విశ్వనాథ ఈవెంట్స్ పోర్ట్ స్టేడియం లో సోమవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ రచనల్లో, వార్తా కథనాల్లో ,ఆటపాటల్లో క్రీడల్లోనూ పాత్రికేయులు రాణిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులను అందించిందన్నారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో పని చేసే జర్నలిస్టులకు క్రీడల వల్ల మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంటు కోఆర్డినేటర్లు చందు యాదవ్, రవి, రాహుల్.. భరత్ సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్డర్ కిషోర్ కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు కే రాము.. ప్రధాన కార్యదర్శి ఆర్ రామచంద్రరావు, ఉపాధ్యక్షులు కే. చంద్రమోహన్,హరనాధ్ , పరుశరామ్, ఈశ్వర రావు, ఈవెంట్ ప్రోత్సాహకులు జనసేన నాయకులు శిలపరశెట్టి శ్రీనివాసరావు. బిల్డర్ బి.గణేష్ కుమార్,ఫ్యూచర్ డెవలపర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Journalist Premier League in

You cannot copy content of this page

Scroll to Top