Journalism Students Volunteer : తెలుగు విశ్వవిద్యాలయంలో జ‌ర్న‌లిజం విద్యార్థుల శ్ర‌మ‌దానం

TRINETHRAM NEWS
  • ప్ర‌గ‌తి ప్ర‌ణాళికలో భాగంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం.

కూకట్పల్లి మార్చి 10 : (త్రినేత్రం న్యూస్) : బాచుప‌ల్లిలోని సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి తెలుగు వ‌ర్సిటీలో సామాజిక బాధ్య‌త‌లో భాగంగా అధ్యాప‌కులు, విద్యార్థులు శ్ర‌మ‌దానం చేశారు.ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” లో యూనివ‌ర్సిటీ కూడా భాగ‌స్వామ్య‌మైంది.

వ‌ర్సిటీ వీసీ ఆచార్య‌ వెలుదండ నిత్యానంద‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హ‌నుమంత‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, నోడ‌ల్ అధికారి ఆచార్య బీహెచ్‌. ప‌ద్మ ప్రియ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. దీనిలో భాగంగా, తెలుగు విశ్వవిద్యాలయం బాలుర హాస్టల్ పరిసర ప్రాంతాల‌ను ప‌రిశుభ్రం చేశారు. భవ‌న ప్రాంగ‌ణాల‌ను, త‌ర‌గ‌తి గ‌దుల‌ను కూడా శుభ్ర‌ప‌రిచారు.

ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌ప్రియ మాట్లాడుతూ హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. వ‌ర్సిటీలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల‌ని సూచించారు.ఈ కార్య‌క్ర‌మంలో డా. రత్నశ్రీ, డా. రాధ, జ‌ర్న‌లిజం అధ్యాప‌కులు డా.షేక్ హ‌సీనా, డా.షేక్ స‌మీర్‌, డా.వెంక‌టేశ్వ‌ర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Journalism students volunteer at Telugu University

You cannot copy content of this page

Scroll to Top