TRINETHRAM NEWS

షెడ్యూల్డ్ ఏరియాలో ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలి: ఆదివాసి జేఏసీ.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( జీ.కె. వీది మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : ముఖ్యమంత్రికి ఆదివాసీ జెఎసి వినతిపత్రం.

షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగాలు స్థానిక గిరిజనలతోనే భర్తీ చేయాలని, జీ.కె.వీది
మండల తహాశీల్ధార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు, జికె వీధిమండల కన్వీనర్ కొర్ర బలరాం,ప్రధాన కార్యదర్శి బత్తుల సిద్దార్ధ మార్క్,మండల సాంసృతిక విభాగం అధ్యక్షుడు లకే రామచంద్రుడు,అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొర్ర మల్లేశ్వర్రావు వినతిపత్రం పంపించారు.వివరాల్లోకి వెళ్తే 5వ షెడ్యూల్ ప్రాంతము,ఆర్టికల్ 244(1) పేరా 5(1) లో మార్పులు చేర్పులు చేసి,షెడ్యూల్ ఏరియాలో ఉపాధ్యాయ, మరియు ఇతర ఉద్యోగాలు స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయుటకు, గిరిజన సలహా మండలి(టిఎసి)తీర్మానాన్ని చేయుటకు తగిన సహాయ సహకారాలు చేయమని కోరారు.ఏజెన్సీ 5 వ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న అన్ని రంగాలలో బాగా వెనుకబడిన ఆదివాసి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకురావటం కొరకు ఏజెన్సీ ప్రాంతంలో ఐటిడిఏలు ఏర్పాటు, గురుకుల పాఠశాలలు, మరియు కాలేజీలు ఏర్పాటు,బెస్ట్ ఎవైబుల్ స్కూల్ ఏర్పాటు మరియు స్థానిక గిరిజన అభ్యర్థులతో లోకల్ క్యాడర్ పోస్టులు భర్తీ కొరకు 29 జిఓలు వివిధ ప్రభుత్వ 25 శాఖలకు సంబంధించి ఇచ్చి ఉన్నారని,
1986 నుండి 2000 సంవత్సరం వరకు స్వర్గీయ ఎన్టీరామారావు,నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిల కాలంలో జరిగి ఉన్నాయని,స్వర్గీయ ఎన్టీరామారావు జిఓ 275ని1986 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు జిఓ నెం 3 ముఖ్యమంత్రిలుగా ఉన్న సమయంలో ఇచ్చి ఉన్నారని,ఈ జిఓల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న లోకల్ క్యాడర్ ఉపాధ్యాయ ఉద్యోగాలు, స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేసారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆర్టికల్ 244(1) పేరా 5 (1) ప్రకారం రాజ్యాంగంలో ఉన్న అధికారం చట్టాలలో మార్పులు చేర్పులు చేసుకొని షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి నోటిఫికేషన్ ద్వారా వర్తింప చేయవచ్చు కానీ, జిఓ నెం 3 రూల్స్ లో మార్పు చేసినందున ఈ జిఓను సుప్రీంకోర్టు కొట్టి వేయడం జరిగింది.భారత రాజ్యాంగం ఆర్టికల్ 244 పార్ట్ X షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ఏరియాస్ ఆర్టికల్ 244(1),5 వ షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిశీలన మరియు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఈ షెడ్యూల్ ప్రాంతముకు సంబంధించి ఈ ప్రాంత గిరిజనల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు గిరిజన సలహా మండలి ద్వారా తీర్మానాలు చేస్తారు. పేరా 5(1) అనుసరించి పార్లమెంట్ చట్టాలను కానీ, రాష్ట్ర శాసన సభ చట్టాలను కానీ తగిన మార్పులు, చేర్పులతో గవర్నర్ ఈ ప్రాంతానికి నోటిఫికేషన్ ద్వారా వర్తింపచేస్తారు.5 వ షెడ్యూల్ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గవర్నర్ నిర్ణయం తీసుకొనుటకు , గిరిజన సలహా మండలి తీర్మానం కొరకు ఫైల్ పంపియున్నారు. ఈ విషయం గిరిజన సలహా మండలి వద్ద పెండింగ్ లో ఉన్నది.ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రాంత ఆదివాసీల అభివృద్ధి కాంక్ష, లక్ష్యము నెరవేరుట కొరకు పేరా 5(1) ఎక్సెప్షన్ మరియు మోడిఫికేషన్ చేయించాలని, వినతి పత్రంలో జెఎసి నాయకులు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App