పెద్దపల్లి, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు అక్టోబర్ 8న బుధవారం రోజున ఎంపీడీవో ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడరెటర్ ,అనలిస్ట్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా పిజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, స్త్రీ పురుషులు దరఖాస్తు తీసుకువచ్చని, అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8న సంబంధిత సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో పాటు రేస్ యుమ్ తీసుకొని పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గల టాస్క్ సెంటర్ నందు నిర్వహించే జాబ్ మేళా లో హాజరు కావాలని మరిన్ని వివరాలకు 9059506807 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


