ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 12 at 15.43.57

TRINETHRAM NEWS

రేపే జార్ఖండ్ ఎన్నికల నగారా!

సర్వం సిద్ధం!

జార్ఖండ్ : నవంబర్ 12
జార్ఖండ్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ఇక్కడ పోలింగ్ ఆరంభం కానుంది.

పోలింగ్ సవ్యంగా సాగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బంది తమకు కేటాయిం చిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటోన్నారు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది.

జార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయక త్వాన్ని వహిస్తోన్నారు.

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవ డానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.

తొలి దశలో 43 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగనుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమ అదృష్టా న్ని పరీక్షించుకుంటోన్నారు.

వీరిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తొలి విడతలో 15, 344 మంది పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page