త్రినేత్రం న్యూస్… ఆంధ్ర రాష్ట్రంలో పల్లెసీ మలకు,సంక్రాంతి పండగ ముఖ్యమైనది. భాగ్యనగరాల్లో పట్టణాల్లో ఉద్యోగాలు రీత్యా తరలివెల్లినవాళ్ళు, తిరిగి సొంత గ్రామానికి వచ్చేవారు, అత్తవారింటి కి వచ్చే అల్లుళ్ళు లతో గ్రామాలు సందడిగా ఉంటాయి ముందస్తుగా
ఈవారం రోజులు కుటుంబస్థులతో సందడిగా వుంటూ పుట్టిపెరిగిన గ్రామాన్ని అంతటిని తిరుగుతూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడుపుదామని కొండంత ఆశలతో స్వగ్రామానికి వచ్చే గ్రామస్థులకు పరిశుభ్రమయిన గ్రామంగా స్వాగతం పలకటానికి గ్రామపంచాయతీ గ్రామాన్ని అందంగా పరిశుభ్రంగా తీర్చి దిద్దటానికి గ్రామ పంచాయతీ ముందస్తు సన్నాహాలు చేస్తున్నది
ఈ సంక్రాంతి పండగకు స్వాగతం పలకటానికి కడియం మండలం జేగురుపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ కార్యదర్శ అయినవిల్లి శ్రీనివాస్ లు పారశుధ్య కార్మికులతో వీదులను శుభ్రంచేయుస్తున్నారు.
పార్కులను అందంగా తీర్చి దిద్దుతున్నారు ఈ సంక్రాంతి పండగ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని అలాగే ప్రతి మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


