అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
Nandili Sukrayya Leads Campaign

Nandili Sukrayya Leads Campaign : అరకులోయ అక్టోబర్ 31, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలంలోని చొంపి,శిరగం సిగ్మెంట్ పంచాయితీల ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిలి సుక్రయ్య ఫ్యాన్ గుర్తుపై ఎంపీటీసీగా పోటీ చేస్తూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. తాను విజయం సాధిస్తే రెండు పంచాయతీల పరిధిలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నందిలి సుక్రయ్య పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
చొంపి & శిరగం పంచాయతీల సమగ్ర అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని, ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం ప్రజల మద్దతుతో విజయం తమదేననే ధీమాతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page