Mon. Mar 9th, 2026

Pawan Kalyan : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు

TRINETHRAM NEWS

Trinethram News : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరం.
ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసినవారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena Party President Pawan Kalyan launched

Related Post

You cannot copy content of this page