Prema Kumar : వి.ఎం.ఆర్ కాపు ప్రీమియర్ లీగ్ 2025 లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్

TRINETHRAM NEWS

కూకట్పల్లి అక్టోబర్ 11 (త్రినేత్రం న్యూస్) : ఈరోజు గుండ్లపోచంపల్లి శ్రీ కృష్ణ క్రికెట్ గ్రౌండ్ లో వి.ఎం.ఆర్ కాపు ప్రీమియర్ లీగ్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ ఏడిద అశోక్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విశిష్ఠ అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ వారు ప్రేమ కుమార్ ని శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రేమ కుమార్ స్వయంగా మైదానంలోకి ప్రవేశించి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడి,యువతకు ఉత్సాహం కలిగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు,ఆళ్ల నరేందర్,నూకల మల్లేశ్వరరావు,పాలంకి రామకృష్ణ,సాయిని మహేష్,కర్రీ లక్ష్మణ్ నాయుడు,గంధం నాని, పి.ప్రసాద్, యాళ్ళ సురేష్ తధితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

VMR Kapu Premier League 2025

You cannot copy content of this page

Scroll to Top