కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా మోతీ నగర్ కూడలి ,ఎర్రగడ్డ రోడ్డు,హైదరాబాదు వద్ద జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమారి పాల్గొని జిహెచ్ఎంసి , టి జి ఆర్ టి సి, వాటర్ వర్కర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఎలక్ట్రిసిటీ కార్మికులకు శాలువా వేసి సన్మానించి, రోజు కూలీలకు మరియు ఆటో డ్రైవర్స్ కు పండ్లు పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, యువత, సామాజిక సేవ చేస్తున్న పెద్దలు , వీర మహిళలు మరియు కాలనీల ప్రతినిధులైన వారు పెద్ద ఎత్తున హజరైనారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


