తేదీ : 12/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం ప్రజా సమస్యల వేదికలో విస్సన్నపేట మండలం , తెల్లదేవరపల్లి గ్రామంలో సమగ్ర రక్షిత మంచినీటి పథకం వాటర్ పైలట్ ప్రాజెక్టును పున; ప్రారంభించాలని తెలపడం జరిగింది. త్రాగునీరు, సాగునీరు అందజేయాలని విస్సన్నపేట మండలం ముస్లిం మైనార్టీ సమాజానికి కేటాయిస్తున్న కబరిస్తాను స్థలాన్ని సర్వే చేయించి ఇవ్వాలని , అదేవిధంగా సాగునీటి చెరువుల వెంబడి అక్రమ నిర్మాణాలను తొలగించాలని జనసేన పార్టీ తరఫున వినత పత్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా , పార్లమెంటు సభ్యులు కేశినేని.
శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే కొలకపూడి. శ్రీనివాసరావుకు అందజేశారు. తదుపరి విచారణ చేసి ఈ ప్రధాన సమస్యలకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త మనుబోలు. శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు షేక్. యాసిన్, ప్రధాన కార్యదర్శిలు తోట .కృష్ణ కిషోర్, కస్తూరి సీతారామస్వామి, గంగాధర్ పలువురు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


