త్రినేత్రం న్యూస్: మార్చ్ 4: నెల్లూరు జిల్లా: కావలి… జనసేన పార్టీ కావలి పట్టణంలోని బిడ్జి సెంటర్ మరియు ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా రెండవరోజు కూడా కొనసాగుతున్న ఉద్యమి నమోదు కార్యక్రమము ,అళహరి సుధాకర్ సూచనలతో వీరమహిళలు కందుల లక్ష్మీ కవిత, అఖిలగుంట సాహితీ & హెలెన్ లిఖిత మరియు నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి జనసేన సభ్యత్వ నమోదు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మురళీ కృష్ణ, మస్తాన్ తదితరులు పాల్గొని జనసేన సభ్యత్వ నమోదు చేయించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , కల్పిస్తున్న ఉద్యమి సభ్యత్వ ప్రమాద బీమా ప్రయోజనాలు: ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షలు బీమా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్లు కోల్పోయినా లేదా ఒక కన్ను ఒక చేయి ఒక కాలు కోల్పోయినా ,5 లక్షలు బీమా వర్తిస్తుంది.
ప్రమాదవశాత్తు ఒక కన్ను లేదా ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే ,2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు పూర్తిగా వైకల్యం కలిగిన పక్షంలో ,5 లక్షల వరకు బీమా అందించబడుతుంది. కావున నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు అభిమానులు తప్పక సభ్యత్వ నమోదు చేసుకొని పవన్ కళ్యాణ్ భరోసా పొందాలని వారు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


