Holi Celebrations : డిండి మండలకేంద్రంలో ఘనంగా హోలీ సంబరాలు

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి), మార్చి 04, త్రినేత్రం న్యూస్. హోలీ వేడుకల్లో భాగంగా డిండి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా హోలీ వేడుకల ను వాడవాడల్లో నిర్వహించుకున్నారు. సోమవారం రాత్రి కామ దహనం నిర్వహించి, బుధవారం హోలీ వేడుక లు నిర్వహించుకున్నారు.

ఈ వేడుకలలో భాగంగా పురవీధుల్లో యువకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రంగులు పూసుకుంటూ ఆనందోత్సవాలతో వసంత వేడుకలను నిర్వహించుకున్నారు. స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తాలో డీజే సౌండ్స్ లో పాటలు పెట్టి పెద్ద ఎత్తున యువకులు నృత్యాలు చేస్తూ హోలీ పండుగను ఆనందంగా నిర్వహించారు.

మహిళలు సైతం హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హోలీ పర్వదినాన్ని ఆనందోత్సవాలతో నిర్వహించారు. గ్రామంలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి హోలీ వేడుకలలో పాల్గొన్నారు . బాల బాలికలు విద్యార్థిని విద్యార్థులు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ గ్రామంలో హోలీ సందడిని ఘనంగా నిర్వహించారు.
ఈ పండుగ వేడుకలలో స్థానిక సర్పంచ్ రవి, ఎస్సై బాలకృష్ణ ,ఏ టీ కృష్ణ, గడ్డమీది సాయి, గుర్రం సురేష్, చింతపల్లి నరేష్, పో ల వెంకటేష్ బి. శ్రీనివాస్ గౌడ్, గాదే రాజు, పుష్పాక పర్వతాలు, రజనీకాంత్, గాయాల రాఘవేందర్, కొట్ర మధు, సాయి ,వెంకటేష్, సైదాజీ ,తిరుపతయ్య, గుద్దేటి సాయిబాబా ,జయవర్ధన్, శ్రీను మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holi celebrations in Dindi

You cannot copy content of this page

Scroll to Top