దేవరకొండ (చందంపేట) ఆగష్టు 12 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో శ్రీ అంకాలమ్మతల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో కలిసి పాల్గొని దేవతను దర్శించుకొని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆ అంకాలమ్మ తల్లి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు మరియు చిత్రియాల బుడ్డోనితండ పెద్దమూల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


