తేదీ : 14/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి ; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ కుట్రలు సాగవు అని అనడం జరిగింది.
శాంతి భద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని, జగన్ కుట్రలు చేస్తున్నారని, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ కే చెందుతుందంటూ ఆరోపించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


