Parents Expressing Happiness : సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

TRINETHRAM NEWS

తేదీ : 14/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ పట్టణంలో ఇప్పటివరకు ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు అమ్మబడి నగదు చెల్లింపుపలు కుటుంబాలకు ముప్ఫై తొమ్మిది వేలు,ఇరవై ఆరు వేలు. ఇలా ఇంట్లో ఒకరు , ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం నగదు పడుతుండటం తో పాటు అమ్మ కళ్ళల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది. పలువురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం, మెసేజ్ లు రాకపోవడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
మనమిత్ర వాట్సప్ గ్రామ, వార్డు, సచివాలయానికి వెళ్లి డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే వాటిని సరిదిద్ది అర్హులను గుర్తిస్తామని అధికారులు తెలిపారు. కొందరు తల్లులు బ్యాంకు ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడంతో నిధులు వెనక్కి వచ్చేయని తెలిపారు. ఖాతాలను యాక్టి వేట్ చేసుకోవాలని వారి మొబైల్ లకు సందేశాలు పంపిస్తున్నామన్నారు. ఒకటవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదుల చేరే విద్యార్థులకు జులైలో తల్లికి వందనం అమలవుతుందన్నారు. తల్లులు లేని పిల్లలు ఉంటే వాళ్లకి తండ్రి లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేస్తామని అధికారులు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parents expressing happiness

You cannot copy content of this page

Scroll to Top