BCs Reservation : బి సి లకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ రాకపోవడం బాధాకరం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా, పాలకులు, కాంగ్రెస్,బీజేపీ, బి ఆర్ ఎస్,పార్టీల ధ్వంధ్వ నీతికి వ్యతిరేకంగా పరిగిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది పాత్లావత్ గోవింద్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీల హక్కు. బీసీ రిజర్వేషన్ల కల్పనల్లో ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న ద్వంద్వ నీతికి నిరసనగా బీసీలం రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకి అతీతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిద్దాం.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గర లేక గ్రామ కూడళ్ళలో నల్ల బ్యాడ్జీలతో లేక ఇతర శాంతియుత మార్గాల ద్వారా నిరసన కార్యక్రమాలను నిర్వహిద్దాం. భారత స్వాతంత్రం వచ్చి మరియు రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు రాకపోవడం బాధాకరం రాజ్యాంగబద్ధంగా అన్ని రంగాలలో ప్రజాస్వామిక పోరాటాల ద్వారా బీసీల వాటాను సాధించుకుందాం బీసీలు ప్రజాసంఘాల నాయకులు జేఏసీ జిల్లా అధ్యక్షులు ముకుంద నాగేశ్వర్, గొర్ బంజారా హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు అంగోత్ వీరేందర్ నాయక్, వివిధ సంఘాల నాయకులు గోవింద్ నాయక్ రఫీ శ్రీశైలం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు ఎరాన్ పల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BCs are not getting reservation

You cannot copy content of this page

Scroll to Top