Methuku Anand : బీసీ లకు రేవంత్ రెడ్డి ఘరానా మోసం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడారు. అసాధ్యమని తెలిసినా మాటల గారడీ చేసారు. ఒకసారి కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ హడావుడి చేశారు. మరోసారి పార్టీపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేస్తున్నామని ఇలా పూటకో మాటతో ఇన్నాళ్లు కాలయాపన చేసారు. చివరకు చెల్లదని తెలిసినా కూడా ప్రజలను మోసం చేసేందుకు జీవో తెచ్చిన రేవంత్ రెడ్డి..ఆపై తన అనుచరులతో కోర్టులో కేసు వేయించారు.
కోర్టు లో స్టే వచ్చేలా రహస్య మంతనాలు చేసి, డ్రామాల మీద డ్రామాలు ఆడి ఎట్టకేలకు తాను అనుకున్నట్టుగానే బీసీలను మోసం చేశారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం రేవంత్ రెడ్డి కి లేదు అందుకే ఇన్ని డ్రామాలకు పూనుకుని ప్రజలు మరియు నాయకుల విలువైన సమయాన్ని వృధా చేశారు. రేవంత్ రెడ్డి మీ కపట నాటకాలతో ఇన్నాళ్లు BC లను మోసం చేసినందుకు వారి ఆగ్రహనికి గురికాక తప్పదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Revanth Reddy's Gharana is a fraud on BCs

You cannot copy content of this page

Scroll to Top