త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) పెంచిన లక్ష రూపాయలు లబ్ధిదారులకు నేటికీ చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
ఏజెన్సీ స్పెషల్ DSC నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసి పాడేరు రావాలి.
ఆదివాసీ మాతృ బాష ఉపాధ్యాయ లను తక్షణమే రెన్యూవల్ చేయాలి.
ఆదివాసీలు పాడేరు ఐటీడీఏ వద్ద మహా ధర్నాలో నాయకులు హెచ్చరిక,
పిమ్ జన్ మాన్ హాసింగ్ నిధులు మోడీ ప్రభుత్వం దారి మల్లించడం తగదని పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎస్. ధర్మన్న పడాల్ అధ్యక్షతన జరిగిన మహా ధర్నాలో పి. అప్పల నరస మాట్లాడుతూ వెనుకబడిన ఆదివాసీ తెగల అభివృద్ధి అంటూ ఎన్నికల ముందు ఆర్బాట ప్రచారం నిర్వహించిన మోడీ ప్రభుత్వం ఎన్నికల అయిన తర్వాత పిఎం జన్మన్ స్కీమ్ నిధులు దారి మళ్ళించడం చాలా దారుణమైనది. పీఎం జన్మలో 12 శాఖల ద్వారా అభివృద్ధి కి చేయవలసిన, వివిధ రకాల పనులకు కేటాయించిన నిధులు బీహార్ ఎన్నికలకు దారి మల్లిచడం అన్యాయం మని అన్నారు. ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, అమలుకు రూట్ మ్యాప్ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మాతృభాష ఉపాధ్యాయులను తక్షణమే రెన్యూవల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని, జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ పీఎం (ప్రధానమంత్రి) జన్మన్ స్కీమ్ 2023న భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బకాయి సొమ్ము రూ.25 కోట్లు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని, పెరిగిన నిర్మాణ సామగ్రి ధరకులకు అనుగుణంగా ఒక్కొక లబ్ధిదారునికి 10లక్షలు పెంచాలని, 2.0 లో సర్వే చేసిన గిరిజనులకు ఇళ్లులు మంజూరు చేయాలని 12 వేల మందికి పీఎం జన్మన్ హౌసింగ్ ఇల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
18,753 మంది లబ్ధిదారులకు రూ.25 కోట్ల బకాయి సొమ్ము వెంటనే చెల్లించాలి. పాడేరు ఐటీడీఏ పరిధిలో సుమారు 34,570 వేల మంది పీవీటీజీలకు ఇళ్లు మంజూరు చేశారని ఒక్కొక్కరికి రూ.3.39 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు పెంచకపోవడంతో పివిటిజి తెగలు తీవ్రమైన అప్పులు పాలయ్యారని, ఇళ్లు నిర్మాణ బకాయి సొమ్ము రూ.25 కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఇళ్లు నిర్మాణం పూర్తికాలేదని వర్షాలకు, చలి తీవ్రతకు లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందికి గురిఅవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి సొమ్మును వెంటనే చెల్లించాలని, లబ్ధిదారుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పందించిన డి. ఆర్. ఓ మేడం హౌసింగ్ డీఈ మాట్లాడుతూ వారం రోజుల్లో 25 కోట్ల బకాయి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు, కొర్ర త్రినాద్,పాలికి లక్కు కొర్రా బాలయ్య .కిల్లో సత్యనారాయణ ,కొర్రా నర్సయ్య , ,చిట్టిబాబు ,సోమన్న,టీ సూర్యనారాయణ, జి బుజ్జిబాబు, జి చిన్నబాబు, ఎంఎం శ్రీను, ఆదివాసీ మహిళా సంఘం నాయకులు హైమావతి ,ఈశ్వరి లక్ష్మణ్ రావు అంపురంగి బుజ్జిబాబు సుడిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


