కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది

TRINETHRAM NEWS

మెదక్‌ : కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. వీరిలో సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి శుక్రవారం అర్జీ సమర్పించగా, శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జలిగామకు చెందిన బండారి శ్రీకాంత్‌రావు, అక్బర్‌పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్‌కు చెందిన మద్దుల సోమేశ్వర్‌రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు అర్జీలు సమర్పించారనేది తెలియాల్సి ఉంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. మరో వైపు మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

You cannot copy content of this page

Scroll to Top