ఎన్నికల హామీని తుంగలో తొక్కుతారా?
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు
త్రినేత్రం న్యూస్, కాకినాడ నవంబర్ 28: గత ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు .. శుక్రవారం సిపిఐ జిల్లా సమితి బృందం కాకినాడ సిటీలో నిర్మించిన టిడ్కో గృహాలను జగనన్న కాలనీలను పరిశీలించింది
ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ గత ప్రభుత్వం చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందని అవి డబ్బులు లేక నిర్మించుకోలేదని వారందరికీ ప్రభుత్వం వెంటనే 6 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇళ్లు నిర్మించాలని ఆయన కోరారు అర్హులైన రబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత సంవత్సరం కాలంగా సిపిఐ దరఖాస్తులు పూర్తిచేసి ప్రభుత్వం ఇచ్చిందని అయినా ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదని మధు తెలిపారు సూపర్ సిక్స్ లో ప్రధానమైన ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చడంలో చంద్రబాబు తుంగలో తొక్కిందని మధు విమర్శించారు అసలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు కాకినాడ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదలతో ఇళ్ల స్థలాల భూ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థలో టిడ్కో గృహాలు ఉన్నాయని చెప్పారు టిడ్కో గృహాలు పట్టణం లో 2050 టిడ్కో గృహాలు ఇప్పటికీ లబ్ధిదారులకు అందకపోవడం పేద ప్రజల భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాలను ఇకనైనా వెనువెంటనే నిధులు మంజూరు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టి కనీసమైన మౌలిక సదుపాయాలు చేపట్టాలని కోరారు , నిరుపేద లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.2018లో నాటి ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద నుండి రూ.25,000, రూ.50,000, రూ.75,000లను వసూలు చేసి నేటికీ గృహాలు ఇవ్వకపోవడం, దారుణమని,ఇది ప్రజలను వంచించటమేనని ఆయన అన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం నిదర్శనమే ఇప్పటివరకు లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందకపోవటం అని అన్నారు. పేదల బస్తీలుగా ఉండవలసిన టిడ్కో గృహాలు అసాంఘిక కార్యకలాపాల ఆవాస కేంద్రాలుగా, మారిపోతున్నాయని, ఓటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర కాలం గడుస్తున్న ఈనాటి వరకు ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గాని టిడ్కో గృహాల గృహప్రవేశం, పట్ల నిమ్మక నీరు వచ్చినట్లు ఉన్నారని విమర్శించారు.
ఇంకా ఈ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోరకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు, పప్పు ఆదినారాయణ పి సత్యనారాయణ ఏ భవాని బొబ్బిలి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు మహిళా సమైక్య నాయకురాలు సుబ్బలక్ష్మి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


