Amarnath Chaudhary : రావులపాలెం డిప్యూటీ ఎంపీడీవో గా అమర్నాథ్ చౌదరి

TRINETHRAM NEWS

త్రినేత్రం.. రావులపాలెం మండల గ్రామ సచివాలయాల(జిఎస్‌డబ్ల్యుఎస్) డిప్యూటీ ఎంపీడీవో గా వెంటూరి అమర్నాథ్ చౌదరిని నియమించారు. ఈయన మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రేడ్-1 కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలలో భాగంగా ఈ నూతన డిప్యూటీ ఎంపీడీవో పోస్ట్ కు సీనియార్టీ ఆధారంగా పదోన్నతి లభించింది. కె. గంగవరం మండలం కోటిపల్లి కి చెందిన అమర్‌నాథ్ చౌదరి 1996లో మండపేట మండలం ఏడిద గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు.అనంతరం అదే మండలం అర్తమూరులో పనిచేశారు.

2014లో గ్రేడ్ 2 కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏడిదలో పనిచేశారు.2015లో గ్రేడ్ 1 కార్యదర్శిగా పదోన్నతి పొంది అదే పంచాయతీలో కొనసాగారు. 2019లో కడియం మండలం మురమండ పంచాయతీ కార్యదర్శి గా బదిలీపై వెళ్లారు. ఆ సమయంలోనే కడియం గ్రామపంచాయతీకి ఇన్చార్జిగా పనిచేశారు.అనంతరం 2022లో మళ్ళీ మండపేట మండలం జెడ్.మేడపాడు గ్రామ పంచాయతీకి బదిలీపై వచ్చారు.ఈయన సర్వీసు అధిక శాతం మండపేట మండలంలోనే కొనసాగింది.పదోన్నతి పొందిన అమర్‌నాథ్ చౌదరిని మండపేట ఎంపిడివొ కె.సత్యనారాయణ, డిప్యూటీ ఎంపిడివొ దాసరి శ్రీనివాస్, మండలపరిషత్ ఎవొ డివివి రామకృష్ణ తదితరులు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Amarnath Chaudhary appointed as Ravulapalem Deputy MPDO

You cannot copy content of this page

Scroll to Top