తేదీ : 01/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం నియోజకవర్గం పంట పొలాలకు ఖరీఫ్ సీజన్లో సాగు నీటి కొరత లేకుండా చూడాలని , కాలువ చివరి భూములకు సమృద్ధిగా నీరు అందించాలని ప్రభుత్వ చిప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావు . నీటి సంఘాల అధ్యక్షులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. గడిచిన ఎనిమిదేళ్ళ కాలంగా పూడికతీతకు నోచుకోని ఏలూరు కాలువ ఉంగుటూరు మేజర్ పూడికతీత పనులను బుద్దవరంలో ప్రారంభించారు. ఎనిమిది వేల ఎకరాల్లో పంట పొలాలకు నీటి కొరత ఏర్పడు కుతుంది దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే ఆయన స్పందించి తక్షణమే సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు నీటి సంఘం నిధులతో పది కిలోమీటర్ల పొడవునా కాలువ పూడిక తొలగింపు పనులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావుతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు తమ సమస్యలు తనకు తెలిసిన వెంటనే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ కోసరాజు. రాము, వైస్ చైర్మన్ జాస్తి.విజయ భూషణ్ కుమార్, దాసరి. శ్రీకృష్ణ. కూటమి నాయకులు దయ్యాల రాజేశ్వరరావు దయాల. రాజేశ్వరరావు, గొంది. నరేంద్ర, మేడేపల్లి. రమ, బోడపల్లి .రాంబాబు గొంది .శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


