చేయించండి జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటలకు స్థానికుల ఫిర్యాదు కల్వకుంట్ల కవిత , ఆమె భర్త అనిల్ కుమార్ లు సాగిస్తున్న భూ కబ్జా పై స్థానికులు కొందరు శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి కవిత , ఆమె భర్త అనీల్ చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు . నగర నడిబొడ్డున ఉన్న రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనీల్ పేరుతో కబ్జా చేసిందని స్థానికులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు., కూకట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో ఐడిపిల్ కు చెందిన సర్వే నంబర్ 2010/4 భూమి లో కవిత భర్త అనీల్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఏ వి రెడ్డి తో కలిసి కొట్టేశారని , ఓవర్ లాప్ భూ సర్వే నంబర్ల ఆధారంగా చేసుకొని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు .ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని , ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు.
కవిత భర్త అనిల్ కు ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్నదానికి సమాధానం లేదన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక భూబదిలీ జరిగిందని , దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ , సీఎం బినామీ ఏ వి రెడ్డి లు ప్రత్యక్షంగా ఉన్నారని , సీఎం రేవంత్ రెడ్డి , జాగృతి అధ్యక్షురాలు , మాజీ సీఎం కెసిఆర్ కూతురు కవితలు పరోక్షంగా ఉన్నారని వివరించారు . రెండు కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కాపాడాలని , ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల , హాస్పిటల్ వంటి ప్రజోపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు .తాము అనేకసార్లు హైడ్రా కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని , సీఎం , కవితలు జోక్యం తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవడం లేదన్నారు . కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదన్నారు . ఇడి, సిబిఐ, డైరెక్టర్ రెవిన్యూ ఇంటలిజెన్స్ కు తాము ఫిర్యాదు చేస్తామని , కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ లు చేసిన భూదందా పై పార్లమెంట్ లో మాట్లాడాలని విజ్ఞప్తి చేసారు . ఈ అంశం పై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందిస్తూ .. సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ప్రభుత్వ భూమిని కాపాడుకుందామని వారికి హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


