Motorcycle Thief Arrested : అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో డిఎస్పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానిలో భాగంగా వివరాలు తెలియజేస్తూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ అఖిల తన సిబ్బందితో భద్రాచలం రోడ్డులో గల హెచ్.పీ పెట్రోలు బంక్ సమీపంలో వాహనాల తనిఖీలు లో భాగంగా వాహనాలు చెకింగ్ చేస్తుండగా నిందితుడు ముత్యాల గణేష్ సన్నాఫ్ రాంబాబు, పుట్లగట్ల గూడెం గ్రామం. జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, వాసి అశ్వారావుపేటలో దొంగలించిన మోటార్ సైకిల్ తో పరార్ అవుతుండగా పోలీసుల తనిఖీలలో చిక్కినాడు.

తమదైన శైలిలో విచారించగా మొత్తం 10 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 మోటార్ సైకిల్ ను . అశ్వారావుపేట స్టేషన్ పరిధిలో 3 మోటార్ సైకిల్ దమ్మపేటస్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ దొంగిలించినాడు ముద్దాయి మద్యానికి, జల్సా లకు, వ్యసనాలకు, అలవాటు పడి వచ్చే ఆదాయం సరిపోక పోవటంతో సుమారు గత 6 నెలల నుండి మోటార్ సైకిల్ ను దొంగతనం చేసినాడు అట్టి మోటార్ సైకిల్ లను అశ్వారావుపేట పోలీసులు పంచుల సమక్షంలో స్వాధీనపరచుకొని ముద్దాయిని రిమాండ్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సిఐ నాగరాజు ఎస్సైలు యయాతి రాజు, అఖిల, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర రావు. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Interstate motorcycle thief arrested

You cannot copy content of this page

Scroll to Top