ఉపాధి హామీ కూలీలకు పిలుపునిచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వై నాగేంద్రరావు
పోలవరం నియోజకవర్గం ( త్రినేత్రం న్యూస్ ఇంచార్జ్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉపాది హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి, పని దినాలు పెంచాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై నాగేంద్రరావు డిమాండ్ వ్యవసాయ కార్మిక సంఘం కుక్కునూరు మండల కమిటీ ఆధ్వర్యంలో చీరవెల్లి, దామరచర్ల గ్రామాల్లో ఉపాధి పని ప్రదేశాలు పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా నాగేందర్రావు మాట్లాడుతూ మనకు పిడికిడు మెతుకులు పెడ్తోన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పధకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న ఈ పధకాన్ని తిరిగి పోరాడి రక్షించుకోవాలని జిల్లా విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు. ఇందుకు మే 20న ఒక రోజు దేశ, వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు బంద్ చేయాలనీ, మండల కేంద్రాలు, గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలన్నారు. ఒక ప్రక్క వ్యవసాయపు పనులు క్రమేపి తగ్గిపోతున్నాయని, రెక్కల కష్టమే ఆధారంగా జీవిస్తున్న పేదలకు వంద రోజుల ఉపాధి పనులే దిక్కౌతున్నాయన్నారు.
పొమ్మన లేక పొగబట్టేతీరుగా ప్రభుత్వాలు పధకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు . దేశ వ్యాప్తంగా వంద రోజులు పనులు చూపించాలంటే కేంద్ర మోడీ ప్రభుత్వ బడ్జెట్లో 2.50 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ కేవలం 83 వేల కోట్లు (30శాతం) మాత్రమే కేటాయించి, నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అంబానీ, అదాని లాంటి ప్రపంచ కోటీశ్వరులకు బ్యాంకుల్లో 12 లక్షల కోట్లకుపైగా అప్పులు రద్దు చేసారని, పేదలకు పట్టెడన్నం పెట్టే పధకానికి మొండిచేయి చూపుతున్నారని ఏద్దేవా చేశారు. ఇప్పటికే 30 రోజులకు కూడా పనులు దక్కడం లేదని, పని చేసిన రెండు వారాల్లోపు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా 13 వారాలుగా వేతనలివ్వడంలేదని మండిపడ్డారు.
ఏ రోజు కూలీ డబ్బులతో ఆపూట గడిచే పేదలకు వంద రోజులైనా వేతనాల్వికుంటే ఎలా బ్రతుకుతారాని ప్రశ్నించారు. ఇటీవల ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏ.లు తమ జీతాలు నెలకు 50 వేలుకు పైగా తామేపెంచుకున్నారు. కానీ ఉపాధి కూలీలకు మాత్రం కేవలం ఏడు రూపాయలు పెంచారని తెలిపారు. గ్రామీణ ప్రజల కొనుగోలు (అవసరమైన సరుకులు కొనడం) శక్తి పెరగాలంటే ఉపాధి పనులు 200 రోజులు పెంచాలని, ప్రస్థుత ధరలకు 600 రూపాయాలు వేతనమిస్తేనే జీవించగలరంని ఆర్ధికవేత్తలతోపాటు సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మన పోరాటాల ద్వారా యుపిఏ ప్రభుత్వ కాలంలో వత్తిడి ఫలితంగా వచ్చిన ఈ పధకాన్ని మనమే రక్షించుకోవాలని కోరారు.
అందుకై తిరిగి పోరాటమే మార్గమ్మన్నారు. కాబట్టి మే 20న కార్మికులు తమ చట్టాలు, పని భద్రత కోసం దేశ వ్యాప్త సమ్మె చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటుధరల చట్టం కోసం రైతులు గ్రామీణ హర్తాళ్ చేస్తున్నారు. మన ఉపాధి చట్టం రక్షణ కోసం మనం ఒక రోజు మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలనీ పిలుపు నిచ్చారు. ఆరోజున జరిగే మండల కార్యాలయాలు, గ్రామ సచివాలయాల వద్ద నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలులో గ్రామీణ ప్రాంత పేదలు వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వై. నాగేందర్ రావు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


