ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2024

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల టిటిడి కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ ఛాంపియన్షిప్ ఆదివారంనిర్వహించారు. Y N R మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ యర్రా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 20 జిల్లాలకు సంబంధించిన 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కరాటే టీం చీఫ్ కోచ్ కీర్తన్ కొండ్రు మరియుk. M. L. శాస్త్రి ప్రెసిడెంట్(S KO AA P ) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ మొదటి స్థానంYN R మాస్టర్ ఆర్ట్స్ అకాడమి బాపట్ల వాళ్లు మరియు రెండు స్థానం ప్రకాశం జిల్లా వాళ్లు కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా 40 బంగారు పతకాలు, 20 రజిత పత కాలు, 8 కాంస్య పత కాలు ynr మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ బాపట్ల విద్యార్థులు సాధించారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్షిప్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్. మోహన్ రావు, ఛాంపియన్షిప్ చీఫ్ రిఫరీగా ఎస్. వెంకటేశ్వర రావువ్యవహరించారు. విశిష్ట అతిథులుగా మన్నే శ్రీనివాస రావు, కె. మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top