Inter Public Exams : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

TRINETHRAM NEWS

Trinethram News : 10.57 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం..

10.57 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుంది. మొత్తం 1,537 పరీక్షా కేంద్రాల్లో 10,57,312 మంది విద్యార్థులు పాల్గొంటారు. పరీక్షలు ఉదయం 9:00 గంటలకు మొదలవుతాయి.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు హెచ్చరించారు..

పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు,, స్మార్ట్ వాచ్‌లు,, కాలిక్యులేటర్‌లు సహా ఎలాంటి గాడ్జెట్లకు చోటు లేదు.. ప్రతి పరీక్షా గదిలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు.. విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్సులు ఏర్పాటు చేశారు..

ఏదైనా సమస్యలకు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1800 425 1531పై సంప్రదించవచ్చు.పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Inter public exams across the state

You cannot copy content of this page

Scroll to Top