జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 4.27.14 PM

TRINETHRAM NEWS

మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు!

అమరావతి:

2024 మార్చి 3నుంచి – 10తేదీ వరకు టెన్త్
మార్చి 1 నుంచి – 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1 తేదీ నుంచి నిర్వహించాలని ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. మార్చి 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం చేసి 10వ తేదీ వరకు కానున్నాయి.

సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉన్నందున.. పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాతో అధికారులు చర్చించి విడుదల చేసినట్లు సమాచారం.

You cannot copy content of this page