తేదీ : 16/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకోడేరు మండలం, లో ఓ భార్య తన భర్తతో ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి, చిత్రహింసలకు గురి చెయ్యగా, ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చికిత్స నిమిత్తం బాధిత మహిళను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెపై దాడికి పాల్పడిన వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవి వర్మ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


