కొంపల్లి లో నిర్వహించిన అయ్యప్ప స్వామి 18 కలశాలల మహా పడి పూజ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్…
ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫ్లోమ్ గ్రోస్ పేజ్ -3 లోని ఎంబీసీ గోకులం నందు నిర్వహించిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి 18 కలశాల మహా పడిపూజ మహోత్సవానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై హరిహర సుతుడు అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జీవితానికి శాంతి, శక్తి, విజయాన్ని అందించే దైవం అయ్యప్ప స్వామి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు సుబ్రమణ్యం, ఎస్.వి. శివరావు, వై.జగన్ మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, మహిళా నాయకురాలు సంగీతా రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


