భవిష్యత్ రోజుల్లో పార్టీ నిర్మాణానికి పార్టీలో విశ్వసనీయతకు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అధిష్టానం సూచనలతో ముందుకెళతా. – డా. వంపూరు గంగులయ్య.

TRINETHRAM NEWS

భవిష్యత్ రోజుల్లో పార్టీ నిర్మాణానికి పార్టీలో విశ్వసనీయతకు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అధిష్టానం సూచనలతో ముందుకెళతా. – డా. వంపూరు గంగులయ్య.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్: అల్లూరి సీతారామరాజు జిల్లా

జనసేన పార్టీ అరకు పార్లమెంట్, మరియు పాడేరు నియోజకవర్గం ఇంచార్జీ
డా.వంపూరు గంగులయ్య.

పాడేరు నియోజకవర్గం లో జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు,రాజకీయ అజ్ఞానంతో పార్టీ తో సంబంధం లేకుండా కుళ్ళు కుతంత్రాలతో విషం నింపుకున్నటువంటి వ్యక్తులతో కలిసి,పార్టీ నీ డ్యామేజ్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలు ఈ రోజు నుండి కాదు ఆధినుంచి కూడా మనం చూస్తూనే వున్నాం. సహజంగానే ఏ రాజకీయ పార్టీ లో నైనా,ఏ ఉద్యమంలోనైన, ఏ వ్యవస్తలోనైన కుట్రలు,కుతంత్రాలు,వెన్నుపోట్లు అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. విశ్వసనీయత అనేది కోల్పోయిన పరిస్థితులు ఈ రోజున గిరిజన ప్రాంతంలో ఎందరినో చూస్తూనే వున్నాం.అలాంటి తరుణంలో జనసేన పార్టీని చాలెంజ్ గా తీసుకుని గిరిజన ప్రాంతాల్లో సంస్థగత నిర్మాణం చేస్తూ భవిష్యత్ రోజుల్లో జనసేన ఆధిపత్యమే మన అందరి లక్ష్యంగా ఈ రోజు నిర్మాణానికి మనమంతా అహర్నిశలు శ్రమించి రాజకీయ క్షేత్రంలో గిరిజన ప్రజల ముందు నిలబడ్డాం.ఇటువంటి సమయంలో జిసిసి డైరెక్టర్ పదవి నాకు కేటాయించిన కారణంగా అధి స్థాయికి తగ్గట్టుగా,లేదు పార్టీ నిర్మాణానికి దోహదపడేలా లేదు కాబట్టి గౌరవప్రదంగా వుంటే బాగుంటుందనేటువంటి ఒత్తిడి అనేక రకాల వ్యక్తుల దగ్గర నుండి, గిరిజన ప్రజల దగ్గరనుండి,వివిధ సంఘాలనుండి వచ్చినటువంటి ఒత్తిడి దృష్ట్యా పార్టీకి ఎక్కడ నష్టం జరగని పద్ధతిలో ప్రజలు,క్యాడర్ యొక్క మనోభావాలను బహిర్గతం చేయడం జరిగింది. అయితే అవకాశవాదంతో స్వార్థపరులు తప్పుడు ఆలోచల విధానాలతో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని, కుతంత్రం తో కూడిన ఆలోచనా అమలు చేసేదాంట్లో బాగంగా మనపై ప్రెస్ మీట్లు ద్వారా జరిగిన కుట్రలు కావచ్చు,అంతర్గతంగా జరుగుతున్నటువంటీ కుట్రలు కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ రకమైనటువంటి చర్చలు ఆరోగ్యకరంగా వుండాలి కాని, కుతంత్రాలతో కూడుకున్న విధానాలు,పార్టీకి గానీ వ్యక్తిగతంగా కానీ,పార్టీలో పనిచేస్తున్న అనేక మందిపై గానీ మంచిది కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరెవరు ఏంటి? ఏ రకమైన ఆలోచన విధానం కలిగిఉన్నారు? అనేటటువంటి విషయాలు చాలావరకు బహిర్గతమైంది.అధి భవిష్యత్ రోజుల్లో దానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకెళ్లెవిధంగా మనకొక ఆలోచన కల్పించిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేస్తూ..రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణానికి, పార్టీ లో విశ్వసనీయతకు ఏమి చెయ్యాలో,ఎలా చెయ్యాలో నేను జనసేన పార్టీ సిద్ధాంతాలకు లోబడి అధిష్ఠానం సూచనలతో ముందుకెళ్లెవిధంగా కార్యాచరణ చేస్తానని తెలియజేస్తున్నాను.కుతంత్రాలతో కూడుకున్న చెడు ప్రచారానికి మనస్సాక్షి తో, మంచితనంతో ముందుకు సాగడానికి ఆలోచన చేస్తే ఏ వ్యక్తికైనా సమాజంలో గౌరవం పెరుగుతుంది. తద్వారా మేలుజరుగుతుందని గుర్తు చేస్తున్నాము.సోషల్ మీడియాలో,లేదనుకుంటే స్వార్థపరులు ఆలోచన విధానంతో జరుగుతున్న చెడు ప్రచారానికి ఇంతటితో ముగింపు పలకాలని స్వార్థపూరిత వ్యక్తుల ఉచ్చులో నిస్వార్ధంగా,నిజాయితీగా పని చేసే జనసైనికులు,నాయకులు ఆ ట్రాప్ లో వెళ్లొద్దని ఇందులో అనేకమంది మనసుకి గాయం కలిగినప్పటికీ రాజకీయాల్లో కుళ్ళు,కుతంత్రాలు, స్వార్థమనేది సహజంగానే నడుస్తుందనే,సత్యాన్ని గ్రహించాలని ఇటువంటి విషయాలను సాధారణంగానే తీసుకుని ఇంతటితో ఈ చర్చలు ముగించాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top