WhatsApp Image 2024 02 15 at 17.45.26
Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.. రాత్రుల సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది.. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది.. చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. చిరుతపులి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో శ్రీశైలంలోని స్దానికులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు.. శ్రీశైలంలో గతంలో కూడ చిరుతపులులు ఔటర్ రింగ్ రోడ్ శివాజి స్పూర్తి కేంద్రం రూద్రాపార్క సమీపంలో చిరుతలు భక్తులకు కనబడ్డాయి.. అయితే శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు.. శ్రీశైలం వచ్చి వేళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు భక్తులకు విజ్ఞప్తి చేశారు..
