జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 05 at 10.49.35

TRINETHRAM NEWS

పాడేరు లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు రోడ్లు గుంతలు పూర్చే కార్యక్రమం మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన , మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: *అల్లూరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి కి సరస్వతి విగ్రహం బహుకరించిన జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ, మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జ్ స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి పాడేరు విచ్చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం,గుంతలు పూర్చే కార్యక్రమం, మరియు అధికారులతో సమీక్ష సమావేశం, అనంతరం దరఖాస్తు దారులతో ఫిర్యాదులు స్వీకరించడం మొదలగు కార్యక్రమాల నిమిత్తం పాడేరు విచ్చేసిన స్త్రీ శిశు సంక్షేమం,గిరిజన శాఖ మంత్రి మరియు అల్లూరి జిల్లా ఇంచార్జ్ అయిన గుమ్మడి సంధ్యారాణి కి సరస్వతి విగ్రహం బహుకరించడం జరిగింది. గంగులయ్య తెలుపుతూ సరస్వతి విగ్రహం బహుకరుస్తున్న తరుణంలో గిరిజన ప్రాంతంలో సరస్వతి కుసుమాలు విరజల్లెటట్లు ఈ విగ్రహం చూసినప్పుడల్లా మీరు గుర్తుచేసుకుంటూ గిరిజన ప్రాంతం యొక్క విద్యాభివృద్ధికి కృషి చెయ్యాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బొనుకుల దివ్యలత, ఐటీ ఇంచార్జ్ సాలేబు అశోక్, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గొర్లె వీరవెంకట్ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, జీ. మాడుగుల మండల అధ్యక్షులు మాసాడ భీమన్న, అధ్యక్షులు తెరవాడ వెంకట రమణ పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్,కార్యనిర్వహణ సభ్యులు తాంగుల రమేష్, గూడెం మండల అధ్యక్షులు కోయ్యం బాలరాజు, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాల భూపాల్, మండల నాయకులు సుర్ల సుమన్, కుంచే.దేవేంద్ర ప్రసాద్, ముదిలి సుబ్బారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు_.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page