WhatsApp Image 2024 01 05 at 6.54.07 PM
Trinethram News : 5th Jan 2024
Vijayawada : విజయవాడ ఎస్పీడీ కారాయలయం ఎదుట భారీ సంఖ్యలో నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
విజయవాడ ఎస్పిడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం
నిరసన తెలుపుతున్న ఉద్యోగులను ఈడ్చుకుంటూ పోతున్న పోలీసులు
సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 17 రోజులుగా సమ్మె బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ రోజు విజయవాడలో ఎస్పిడి కార్యాలయం ఎదుట రాష్ట్ర స్థాయిలో వున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ ధర్నా లో పాల్గొని తమ డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు.
సిఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తమని రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి దురుసుగా ప్రవర్తించారని, మేము మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరటం తప్పా అని, మా డిమాండ్స్ తీర్చే వరకు ఉద్యమాన్ని విడిచిపెట్టమని సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర స్థాయి నాయకులు తెలిపారు.
