జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 21 at 9.20.16 PM

TRINETHRAM NEWS

బాపట్ల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ ని నియమించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు.

ఈరోజు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజవర్గ సమన్వయకర్త నామాల వెంకట శివన్నారాయణ పత్రిక సమావేశంలో తెలియజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ శుభాకాంక్షలు తెలియపరచి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని, జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను పత్రిక ముఖంగా ప్రజలకు తెలియజేయాలని కోరారు.

బాపట్ల నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు కి, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ కి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమార్ కి ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన ని శ్రీ పవన్ కళ్యాణ్ మరియు పిసిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆశయాల మేరకు జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.
పత్రికా సమావేశ అనంతరం జన సైనికులు నామన వెంకట శివన్నారాయణ ని మరియు ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ ని సన్మానించారు.

You cannot copy content of this page