జూలై 7, 2026
TRINETHRAM NEWS
Illegal sex determination racket

Illegal Sex Determination Racket : త్రినేత్రం న్యూస్ : నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు.వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌పై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు.హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.మహిళా పోలీసును డికాయ్‌గా పంపి ఆధారాలు సేకరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ హాస్పిటల్ సిబ్బంది హామీ ఇచ్చారు.నిందితులు తుక్కుగూడలోని ఓ క్లినిక్‌కు గర్భిణులను రిఫర్ చేశారు.

క్లినిక్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను పోలీసులు పట్టుకున్నారు.రిసెప్షనిస్ట్ లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు..ముగ్గురిపై పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.అక్రమ లింగ నిర్ధారణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ అంశంపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page