జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 02 at 19.55.08

TRINETHRAM NEWS

రేషన్ డీలర్ల అక్రమ దందా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రేషన్‌ బియ్యం అక్రమ రవా ణా యథేచ్ఛగా సాగుతోంది. ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు. స్థానిక అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోతుండగా జిల్లా కేంద్రం నుంచి విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి దాడులు జరిపితే తప్ప పెద్ద ఎత్తున పట్టుబడిన దాఖలాలు లేవు.

స్థానిక విటల్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ డీలర్ సాయంత్రం కాగానే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఓ బియ్యం వ్యాపారి డీలర్ షాపు వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు స్థానికులు తమ కెమెరాలలో బంధించారు.

దీనిపై రెవెన్యూ ,సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page