Illegal Arrests : గోరక్ష కార్యకర్తల అక్రమ అరెస్టులు… ప్రజాస్వామ్య హక్కుల అణచివేతపై ఆగ్రహం

TRINETHRAM NEWS
Illegal arrests of cow protection activists

కంచి మహేందర్

Illegal Arrests : కూకట్పల్లి మే 20 (త్రినేత్రం న్యూస్) : బాలానగర్ కూకట్ పల్లి నియోజకవర్గం బబ్బుగూడ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గోవుల తరలింపులు, గోవధం మరియు అక్రమ క్రయవిక్రయాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న “చలో బబ్బుగూడ” కార్యక్రమానికి పిలుపునిచ్చిన గోరక్ష కార్యకర్తలను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో కార్యకర్తలను వారి ఇళ్ల వద్ద నుంచే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, ముందుగా సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం అక్కడి నుండి కుల్సుంపుర పోలీస్ స్టేషన్‌కు మార్చినట్లు సమాచారం. అరెస్టు అయిన వారిలో కంచి మహేందర్, కృష్ణా గౌడ్, భార్గవ్ గౌడ్, హరి ప్రసాద్, విజయ్, గోగికర్ రోహిత్ ఉన్నారు. ఈ సందర్భంగా గోరక్ష కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి వచ్చిన గోభక్తుల గొంతును ప్రభుత్వం మరియు పోలీసులు అణిచివేయాలని ప్రయత్నించడం ఖండనీయమని పేర్కొన్నారు. గోవుల రక్షణ కోసం పోరాడుతున్న వారిపై ఈ విధమైన అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమని, గోమాత సంరక్షణ కోసం తమ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని కార్యకర్తలు స్పష్టం చేశారు.“గోమాత రక్షణ కోసం మా పోరాటం ఆగదు… కొనసాగుతుంది”.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top