TRINETHRAM NEWS
బలుముల  ప్రేమ్ కుమార్  

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 2 త్రినేత్రం న్యూస్. హెచ్ సి యు యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని ప్రభుత్వము తన సొంత అవసరాల కోసం ఆడుతున్న ఒక కుట్ర
అక్రమ అరెస్టులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అక్రమ అరెస్టులు పోరాటాలను ఉద్యమాలను ఆపలేవు
ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ
ఈరోజు ఉదయం 6:00 గంటలకి వారి అరెస్ట్ చేసి డిండి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది

HCU భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
HCU విద్యార్థులపై ప్రభుత్వం,పోలీసుల దాడి చేసి ఇష్టానుసారంగా అక్రమ అరెస్టు చేయడం సరికాదు
15నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ని కేటాయించకపోవడం సిగ్గుచేటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సమీపంలోని 400 ఎకరాల భూమి విక్రయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించగా ఏఐఎస్ఎఫ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది కానీ అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే బడుగు బలహీన సంబంధించిన పేద విద్యార్థులు తమ విద్యను అభ్యసించు నీకే ఆ ఒక యూనివర్సిటీలో చేరుతారు కానీ వాళ్ళ జీవితాలతో కూడా చెలగాటమారుతుంది ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో హెచ్‌సీయూ భూమి లేదని తేల్చి చెప్పింది

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి వేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను ఏమీ చేయవని ప్రభుత్వం తెలిపింది. అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిలో చెరువు లేదని స్పష్టం చేసింది. సర్వేలో ఆ భూమి హెచ్‌సీయూకు చెందినది కాదని తేలిందని పేర్కొంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్‌) లేదని.. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలిందని ప్రభుత్వం,
ప్రస్తుతం ఈ భూమిని వేలం వేస్తుండగా.. ఏఐఎస్ఎఫ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు 5:30 ఉదయం నుంచి అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలను నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని బలముల ప్రేమ్ కుమార్ అన్నారు, కానీ నిన్న మొన్న జరిగిన యూనివర్సిటీ దగ్గర నిరసనలో కొంతమంది విద్యార్థులను తమ ఇష్టానుసారంగా కేసులు పెట్టడం జరిగింది ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రం నవీన్‌ కుమార్‌, రోహిత్‌లపై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్‌ యాక్ట్‌ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు పెట్టిన కేసులను తక్షణమే వెనుకకు తీసుకోవాలి లేని క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆందోళనలను చేస్తామని హెచ్చరించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal arrests cannot stop