Police Commissionerate : రామగుండం పోలీస్ కమిషనరేట్

TRINETHRAM NEWS

Ramagundam Police Commissionerate

తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీతండ గ్రామం లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల లంబాడీతండ గ్రామంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ,అదేశాల మేరకు,మంచిర్యాల డి.సి.పి భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు, ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీ లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై మరియు వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ మరియు షీ టీమ్ , డయల్ 100 గురించి అవగాహన కల్పించడo జరిగింది.

ఇట్టి కార్యక్రమం లో బెల్లంపల్లి రూరల్ సి.ఐ. అఫ్జలొద్దిన్ తో పాటు సర్కిల్ ఏస్.ఐ లు నరేష్, రమేష్, ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు 120 మంది హాజరైనారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Ramagundam Police Commissionerate

You cannot copy content of this page

Scroll to Top