త్రినేత్రం న్యూస్. పెదపూడిలో మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ సింగినిడి నాగ తిరుపతిరావు, పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
ఈరోజు నియోజకవర్గ ప్రజలకు నిజానిజాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న మాజీ ఎమ్మెల్యే, మా నాయకుడు రామకృష్ణారెడ్డి, మీద, వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద కూడా విమర్శలు చేసారు. ఆయన అన్ని రకాలుగా రామకృష్ణారెడ్డి ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు.
డాక్టరు, మొన్న రామకృష్ణారెడ్డి, ఫ్యామిలీ గురించి మాట్లాడటం జరిగింది అయితే 50 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు. గొప్ప ఫ్యామిలీ అయితేనే అధిష్టానం టికెట్ ఇస్తారు. మీది కూడా గొప్ప ఫ్యామిలీ అనే చెప్తున్నాను నేను. కానీ ఈయన ఫ్యామిలీని విమర్శిస్తూ తల ఎక్కడో పెట్టుకోవాలి అనడం సభ్యత కాదు. మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, దారుణమైన కేసులు, అక్రమ కేసులకు లెక్కేలేదు. రామకృష్ణారెడ్డి, తిరిగి ఈ పని మీదే ఉంటే ఆయన్ని మీరు తట్టుకోలేరు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా సెల్ఫీ ఫోటో ఏదో పెడితే ధనుంజయ రెడ్డి,తో మాట్లాడి సాక్షి పేపర్ లో వేయించారు మీరు. గతంలో జరిగిన విషయం గుర్తు తెచ్చుకోవాలి 2019- 24 లో కైకవోలులో వాళ్ళంతట వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా చేసుకున్నారో మీకు క్షుణ్ణంగా తెలుసు. ఆ కేసును ఏ విధంగా మాఫీ చేయించారు. ఇంద్ర పాలెంలో ఒక లాయర్ దగ్గర కూర్చుని మీ అనుచరుడు చేత చేయించారు. అదేవిధంగా మొన్న గంజాయి కేసులో ఎవరో కుర్రోడు సెల్ఫీ ఫోటో పెట్టాడని చెప్తున్నారు దానికి ఏమైనా రామకృష్ణారెడ్డి, ఎవరికైనా ఫోన్ చేసి అతన్ని తప్పించండి అని గానీ చెప్పడం మీరు చూశారా?
తరువాత మీరు పిల్లలను ఆశీర్వదించడం నేర్చుకోవాలి తప్ప నా కొడుకు ప్రయోజకుడు నా కొడుకు మీద, నా మీద పడి ఏడుస్తున్నారని అన్నారు మీరు. మీలా మేము మాట్లాడితే మా ఎమ్మెల్యే ఒప్పుకోడు ఆయన సంస్కారం గా ఉంటాడు కాబట్టి నేను అలా మాట్లాడను గాని ఏ రాజకీయ నాయకుడైనా లేక డాక్టర్ చేసినా ప్లేడర్ చేసినా జడ్జి చేసినా రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు తప్ప, రాజకీయాలు చేసేవాడు డాక్టర్ అవ్వాలని కోరుకోరు. మీరు డాక్టర్ కాబట్టి అది ఇబ్బంది లేదు తప్పేముంది డాక్టర్ కాబట్టి డాక్టర్ చదివించుకున్నారు.
మనోజ్ కు ఈమధ్య చంద్రబాబు నాయుడు, ఇన్చార్జి ఇచ్చారు. ఈ మనోజ్ ఎక్కడ ఎమ్మెల్యే అయి, మంత్రి అయిపోయి ఈ రామకృష్ణారెడ్డి, కన్నా గట్టిగా చేస్తారని అనుకుంటున్నారు. 10 సంవత్సరాల నుండి చూస్తున్నాం ఆయన ఎంతో సౌమ్యంగా ఉంటారు. ఎవరి మీద కక్ష కట్టి ఏమి చేయరు కూడా. మీరు ఏంచేసారనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయండి.
మా మండలం అనపర్తి నియోజకవర్గం లో కలసి పది సంవత్సరాలు అవుతుంది. ఈ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వాళ్ళ బావ కేసులో గాని, ఆయనను సెంటర్ జైల్లో పెట్టించడం గాని. వైద్యం గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీ ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే వాళ్ల వాళ్ళ ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్నారు వాళ్ళ అమ్మాయి. అది ఒకసారి మీరు గమనించి మాట్లాడండి. ఫ్యామిలీని విమర్శించడం సమంజసం కాదు, ఇక మీ ఇంటికి వచ్చి ఆయన చెప్పడం జరిగింది చర్చకి రమ్మని. ఎప్పుడూ మీరు రాలేదు. చర్చకి రండని నిన్న ఏదో చిటికేసి చెబుతున్నారు మీరు. ఆయన ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మీరు రెడీ అయి వెళ్ళాలంతే. మీరు వెళ్ళరు.
గవర్నమెంట్ మీ చేతిలో ఉంది ఏం చేస్తారో చేయండి అంటున్నారు మీరు. గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు ఆయన మీద అక్రమ కేసు పెట్టి జైలులో వేయించారు. అలాంటి అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని జైలులో వేయించాలని ఆయన అనుకుంటే నిన్న కాక మొన్న చిన్న సమస్య ఒకటి జరిగింది దాని లాస్ట్ ఫోన్ మీకే వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అతను. కానీ ఆ తరహా మనిషి కాదు ఆయన.
అదేవిధంగా ఏ రకంగాను అన్యాయంగా వెళ్ళాలని ఆయన చూడడు. మా మండలంలో ఉన్న మీ కార్యకర్తలు, మీ లీడర్లు అందరికీ ఆయన ఏ రకమైన గౌరవం ఇస్తున్నాడో చూడండి. మీ పెద్ద లీడర్లు ముక్తేశ్వరరావు ఇంకా చాలామంది కి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఏ రకంగా గౌరవం ఇస్తున్నారో చూడండి.
తెలుగుదేశం అనగానే మీద పడిపోయి వారి మీద కేసులు పెట్టించేసేవారు మీరు. ఆయన అలాకాదు. పంచాయతీ ఎలక్షన్ లో మా మీద 9మంది మీద కేసు పెట్టి నైట్ మమ్మల్ని లోపలేసారు క్రాంతి కుమార్ si ఆయనకు మీరు ఫోన్ చేశారు ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టవద్దని. ఎలాగో వదలరని మాకు తెలుసు. మర్నాడు కేస్ కట్టారు. ఆ కేసు కూడా 14 రోజులు జైలు అని చెప్పేసేసి కట్టారు. సబ్ జైలుకి వెళ్లిపోవడానికి రెడీ అయిపోయాం. మమ్మల్ని స్టేషన్ నుండి జైలు దగ్గరకు తీసుకెళ్లే సమయంలో మా ఇంటి గుమ్మం దగ్గర నిలుచొని ఉన్నాడు మా నాయకుడు. మా చుట్టాలు, పిల్లలు నించోలేదు మా నాయకుడే విలబడ్డాడు. మా కార్యకర్త అందరూ నిటారుగా నిలుచునే సమాధానం చెపుతారు తప్ప ఎవరి దగ్గరా వంగరు. మీ కార్యకర్తలగా రాజీ ప్రయత్నాలు చేయరు.
అడపాదడపా ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ కాళ్లు పట్టుకోండి చేతులు పట్టుకోండి అని చెపుతారు మీరు అది మీ ఇష్టం అనుకోండి. అందువల్ల మావాళ్ళంతా నిటారుగా ఉంటారు తప్ప మీదగ్గరకు రారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మమ్మల్ని మా నాయకుడు కాపాడతాడని ధైర్యంతో ఉంటాం. మమ్మల్ని మీరు 14 రోజులు జైల్లో వేయించాలని మీరు కేసు పెడితే మేము మానాయకుడిని ఏమీ అడగలేదు ఏమి చేసాడో మాకు తెలియదు ఒక గంటలో బెయిల్ తీసుకొచ్చేసారు అది ఆయన గొప్పతనం.
బలభద్రపురం గ్రాసిం ఇండస్ట్రీ విషయంలో ఆయనతో కలిసి వెళ్లి పోరాటం చేయాలి మీరు. మన నియోజకవర్గానికి అక్కడ ఏం అన్యాయం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలి తప్ప ప్రెస్మీట్లు పెట్టి కాలక్షేపం చేయకూడదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


