అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 11: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం లోతేరు, ఇరగాయి పంచాయతీల పరిధిలో అదానీ, నవయుగ కంపెనీలు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎగువ డ్యామ్ కోసం పాతర వేసిన దిమ్మలను ఆదివాసులు సంప్రదాయ ఆయుధాలతో ధ్వంసం చేశారు.
పెసా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ – జీఓ నెంబర్ 51 ద్వారా ప్రభుత్వ అనుమతులు ఇచ్చి 1/70 చట్టం ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రాజెక్టు వల్ల 14 వందల ఎకరాల జిరాయితీ భూములు, వేల ఎకరాల అటవీ భూములు, వన్యప్రాణులు, 500కి పైగా కుటుంబాలు జలసమాధి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
హైడ్రో ప్రాజెక్టు పనులు ఆపకపోతే తరిమికొడతామని, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు, నాయకులు అప్పలస్వామి, కిల్లో బుజ్జి బాబు, పెసా కార్యదర్శి కిల్లో రామన్న, మంగళయ్య, బాబురావు, గంగునాయుడు, సుబ్బారావు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


