ఉపాధి కల్పించుకుంటే దశలు వారి ఉద్యమం
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు పిలుపు
రాజమండ్రి, మే 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ప్రజలకు ప్రతినెలా సక్రమంగా ఇంటింటికీ రేషన్ అందచేస్తున్న ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎం డి యు ఆపరేటర్ల సంఘం తూర్పు గోదావరి జిల్లా నాయకత్వం లో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు దండలు వేసి ప్రారంభించారు దీనికి వైఎస్సీపీ నాయకులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ లు పాల్గొన్నారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వారు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాహనాలు తీసుకుని ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్న ఎండీయూ వ్యవస్థను అర్ధాంతరంగా తొలగించడం ప్రభుత్వానికి తగదన్నారు. దాదాపు 18 వేల మంది కార్మికులు వీధిన పడ్డాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఎండియు ఆపరేటర్లను తక్షణ విధుల్లోకి తీసుకోవాలి. పిడి ఏస్ నుంచి తొలగిస్తే ఉపాధి అవకాశాలు కల్పించాలి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి ఎండియూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి వాళ్లకి కాలపరిమితి 18 నెలలు ఉండగానే ఎటువంటి నోటీసులు లేకుండా తీసివేయడం అన్నది అమానుషం నిరుద్యోగం లేకుండా చేస్తామని ఉద్యోగం చేస్తున్న వారిని రోడ్డున పడేయడం అన్నది ఎంతవరకు న్యాయం ఇంటింటికి రేష్మ అనే పథకం ద్వారా ఎంతోమంది అభాగ్యులు ఎన్నో రేషన్ కార్డులు బెడ్ పేషెంట్లు అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్లి తంబ్ వేయించుకుని రేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చిన జీవ వల్ల ఎంతోమంది అభాగ్యులు బెడ్ మీద ఉన్న పేషెంట్లు సీనియర్ సిటిజన్స్ లైన్ లో నుంచుని రేషన్ షాప్ కి వెళ్లి రేషన్ తీసుకోవాలంటే చాలా కష్టధారకంగా మారుతుందని చెప్పారు
ఈ కార్యక్రమలో సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమాఖ్య కార్యదర్శి పి లావణ్య, ఏఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ సునీల్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, యూనియన్ నాయకులు ఆర్ చిన్ని, హెచ్ దుర్గా ప్రసాద్, పిల్లి సుబ్రహ్మణ్యం, భాషా, హరికృష్ణ, చి రవి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


