జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఎండీవోకు రూరల్ బిజెపి నాయకుల వినతి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, జూలై 7: భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండల స్థాయి పర్యటనలో భాగంగా హుకుంపేట, పిడింగొయ్యి గ్రామాల్లోని కొన్ని సమస్యలను గుర్తించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ ఎండివో సునీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి వినతిపత్రం అందజేరు. బిజెపి రెండో మండల అధ్యక్షుడు మట్ట నాగబాబు అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు ఏసు ,జిల్లా కార్యదర్శి తనుబుద్దిసూర్య భాస్కరరావు సింగవరపు రామకృష్ణ ,ముంగంటి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా కోనేరు పేట జంక్షన్లో వర్షాకాలంలో డ్రైనేజీ నీరంతా కోనేరు పేట ప్రాంతంలో ఇళ్లల్లోకి చేరడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని పరిష్కరించాలని కోరారు.
హుకుంపేట పంచాయతీ శాంతిపురం 2 లో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్యను గుర్తించి తక్షణమే పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంకటేశ్వర మార్కెట్ నుండి 100 అడుగుల రోడ్డులో అనేకమంది వాహనదారులు ప్రయాణం చేయడం ఆ రోడ్డు సక్రమంగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుచేత తక్షణమే వెంకటేశ్వర మార్కెట్ నుండి వంద అడుగుల రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hukumpet and Pidingoyyi problems

You cannot copy content of this page