WhatsApp Image 2024 04 02 at 9.45.28 AM
Trinethram News : ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి చిత్తూరు కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పోడవునా గజమాలలతో ఘనస్వాగతం పలుకున్నారు ప్రజలు. బస్సుయాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేటికి (మంగళవారం) 6వ రోజుకి చేరుకుంది.
అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను వ్యవస్థపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్దం నెలకొంది. ఇవాళ్టి మదనపల్లె సభలో వలంటీర్ వ్యవస్థపై ఈసీతీసుకున్న నిర్ణయంపై జగన్ ఏవిధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.
